చెట్టెక్కి కూర్చున్న రకుల్ ప్రీత్ సింగ్…!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –రకుల్ ప్రీత్ సింగ్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‍లో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. చిన్న హీరోల నుంచి అగ్రహీరోలతో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా బిజీగా ఉండే ఈ అమ్మడు.. గత కొన్ని రోజులుగా సరైన అవకాశాలు లేకుండా.. టాలీవుడ్‏కు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బీటౌన్‏లో ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‏స్టాగ్రామ్‏లో ఓ ఫోటో షేర్ చేస్తూ.. తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చింది.

ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా రకుల్ ఓ చెట్టు ఎక్కి వి సింబల్ చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‏కు ఓ మేసేజ్ షేర్ చేసింది ఈ అమ్మడు. ఆరోగ్యం అనేది బయటి నుంచి ప్రారంభమవుతుంది. అంటే అర్థం జిమ్‏లో వర్కవుట్ చేయడం.. సన్నగా కనిపించడం గురించి చెప్పడం లేదు. మీకున్న అన్ని సమయాల్లో బయటి వాతావరణం మంచి అనుభూతినిస్తుంది. మీరు చేయాలనుకునే పనులను ఈ సమయంలోనే ఎంచుకోండి. అలాగే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించండి. మీ మనస్సు, మెదడును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అలాగే మీలో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎప్పుడూ బయటకు తీసుకురండి. ఎప్పుడూ సరదాగా.. సంతోషంగ ఉండండి అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేడే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ పైలట్ పాత్రలో నటిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డాక్టర్ జీ చిత్రంలో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *