ఏపీలో ఆ మూడు జిల్లాలో కర్ఫ్యూ తప్పదా?

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్ పై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. మూడు నెలల గరిష్టానికి మళ్లీ 24 గంటల్లో నమోదు అవుతున్న కేసులు చేరుతున్నాయి. మళ్లీ లాక్ డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు వారాల క్రితం వరకు కేవలం వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు.. ఒక్క రోజులోనే 3 వేలకుపైగా నమోదు అవుతుండడం ఆందోళన పెంచుతోంది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సెకెండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తోంది.

శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు.. 31 వేల 719 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 3 వేల 945 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా కారణంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకొక్కరూ మరణించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

మరోవైపు విద్యా సంస్థల్లో కేసులు పెరుగుతుండడం మాత్రం ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే చాలా వరకు ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రతి రోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద కాలేజీల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడం.. విద్యార్థుల తల్లిదండ్రులను భయపెడుతోంది. తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోనూ కరోనా కలకలం రేగింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పీ-2, ఈ-3 విభాగాలకు చెందిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రెండు విభాగాలకు అధికారులు అధికారికంగా సెలవులు ప్రకటించారు. వెంటనే వారికి ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీలో కరోనా పరీక్షల నిర్వహణపైనా ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం, విశాఖ జిల్లాల్లో అయితే కరోనా పరీక్ష నిర్వహించిన ఐదు రోజులకు గాని రిపోర్ట్స్ రావడం లేదు. వచ్చిన కొన్నింటిలో గందరగోళంగా ఉన్నాయి అంటున్నారు. అయితే ల్యాబ్ లకు భారీగా కరోనా అనుమానితులు వస్తుండడంతోనే ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయంటున్నారు అధికారుల. ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతుండడంతో వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా కట్టడికి సరైన మార్గమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా టీకా మహోత్సవం జరుగుతోంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు రేపటిటితో బ్రేకులుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో 500, వేయి కంటే ఎక్కువ స్టాక్ లేదని అధికారులు చెబుతన్నారు. ఇప్పటికే చాలా సచివాలయాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అంటున్నారు. కేంద్రం త్వరగా వ్యాక్సిన్ డోస్ లు రాకుండా కరోనా కేసులు కట్టడి చేయడం మరింత క్లిష్టమవుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా మూడు జిల్లాల్లో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. ఒక్క చిత్తూరు జిల్లా 24 గంటల్లో 719 కేసులు నమోదు అవ్వడం కలకలం రేపుతోంది. ఇక గుంటూరు జిల్లాలోనూ 500లకుపైగా కేసులు నమోదయ్యాయి. విశాఖలో కొత్తంగా 400 మందికిపైగా కరోనా సోకింది. మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దాటి.. ఒక్కో జిల్లాలో పాజిటివ్ నిర్ధారణ అవుతుండడం చూస్తే పరిస్థితి చేయి దాటిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తొలి వేవ్ తో పోల్చుకుంటే కరోనా సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉందంటున్నారు అధికారులు.

జిల్లాల వారిగా గత 24 గంటల్లో నమోదైన కేసులు ఇవే

అనంతపురం 209

చిత్తూరు 791

తూర్పు గోదావరి 41

గుంటూరు 501

కడప 192

కృష్ణా 306

కర్నూలు 191

నెల్లూరు 190

ప్రకాశం 215

శ్రీకాకుళం 293

విశాఖపట్నం 405

విజయనగరం 193

పశ్చిమ గోదావరి 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *