కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కరోనా కేసులు మహారాష్ట్రాను వణికిస్తోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండడం భయానోందళనలకు గురి చేస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడంలేదు.
దీంతో ఎలాగైనా కరోనాను కట్టడి చేయాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతకొన్ని రోజులుగా మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధిస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా సర్కారు అదే దారిలో అడుగులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా లాక్‌డౌన్‌ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో సినిమా హాళ్లు మూసివేయాలని నిర్ణయించారు. వీటితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *