భారతీయ ఆధునిక నవాయుగ వైతళికులు, సామాజిక తత్వవేత్త మహాత్మా జోతిరావు పూలె!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –సామాజిక తత్వవేత్త, ఆధునిక నవాయుగ వైతాళికులు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డు క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఛైర్మన్  రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలె కేవలం ఒక సామాజిక కార్యకర్త మాత్రమే కాదు అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలని చైతన్యపరచి వారిలో ఆత్మధైర్యం నింపి వారి హక్కులకోసం పోరాటం చేసిన మహామనిషి మహాత్మా జోతిరావు పూలె అని గుర్తుచేశారు. అగ్ర కులాలు భానిసత్వానికి విముక్తికి పోరాటమొక్కటేనని ప్రకటించిన పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని వారిని ప్రతి బి.సి.సోదర సోదరీమణులు ఆదర్శంగా తీసుకుని అగ్రకుల పార్టీలకి తొత్తులుగా కాకుండా మన జనాభా ప్రాతిపదికన మన రాజ్యాధికారం కోసం మన వాటా కోసం ప్రతిఒక్కరూ ఐక్యంగా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి.సి. మహిళా నాయకులు టి. పెద వెంకటేస్వర్లు, వల్లెపు వెంకటేశ్వరరావు, వంకలు దుర్గారావు, దామర్ల సాంబ్రాజ్యం, టి.కోటేశ్వరమ్మ, స్థానికులు పలువురు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *