గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు నిందితులు అరెస్ట్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా నాయుడుపేట లో జువ్వలపాళెం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో భాగంగ 21 కేజీ ల గంజాయి ఇద్దరు ముద్దాయులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అడిషనల్ ఎస్పీ సెబ్ ఆదేశాల మెరకు తిరుపతి పార్లమెంట్ లో ఎలక్షన్లో భాగంగా వాహన తనిఖీ లు నిర్వహిస్తుండగా నాయుడుపేట మునిసిపాలిటీ పరిధిలోని జువ్వలపాళెం క్రాస్ రోడ్డు వద్ద అర్దరాత్రి APSRTC AP 16 Z 0426 బస్సు లో తనిఖీ చేయగా రెండు బ్యాగులలో 21 కేజీ ల గంజాయి పట్టుకొని ఇద్దరు వ్యక్తులు A సత్తార్ మరియు KP జోసఫ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 Kg ల గంజాయి రెండు సెల్ ఫోన్లు మరియు 3500 రుపాయల నగదు ను స్వాదిన చేసుకున్నారు. ఈ గంజాయి ని వైజాగ్ నుంచి తీసుకొని బెంగుళూరు వెళుతున్నారు. దినీ మార్కెట్ విలువ సుమారు లక్ష రుపాయల పై ఉండవచ్చని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాయుడుపేట సీఐ అబ్దుల్ జలీల్ పేర్కొన్నారు .ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సై శేషమ్మ హెడ్ కానిస్టేబుల్స్ బాబు సతీష్ కానిస్టేబుల్స్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *