ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ పరిస్థితులు..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక.. దక్షిణ కోస్తాంధ్రలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *