ఏపీలో కరోనా కల్లోలం..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఏపీలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 31,892 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,765 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. కోవిడ్ కారణంగా అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూర్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణ,  ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొత్తగా 1245 మంది కరోనా జయించినట్లు ప్రభుత్వం శుక్రవారం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 1,53,65,743 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16422 యాక్టివ్ కేసులున్నాయి.

  1. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య: 918597
  2. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య : 894896
  3. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య: 7279

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *