ఏపీలో టీకా ఉత్సవ్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీకాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 11 నుంచి ఏప్రిల్ 14 వరకు నాలుగు రోజులపాటు టీకా ఉత్సవ్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవ్ లో భాగంగా రోజుకు ఆరు లక్షల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల్లో కనీసం 24 లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని, దానికోసం కేంద్రం నుంచి టీకాలను తెప్పించేందుకు ప్రయత్నం చేయాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. టీకా ఉత్సవ్ తరువాత మరిన్ని మరిన్ని వ్యాక్సిన్లు కేంద్రం నుంచి తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *