అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన స‌ల్మాన్ ఖాన్‌..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –పాన్ ఇండియా సినిమాలు వ‌స్తున్న‌ప్ప‌టి నుంచి హీరోల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోతున్నాయి. భాష‌తో సంబంధం లేకుండా ఒక ఇండ‌స్ట్రీకి చెందిన బ‌డా హీరోలు మ‌రో ఇండ‌స్ట్రీకి చెందిన హీరో గురించి మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల మ‌ధ్యే పోటీ ఉంటుంది కానీ.. త‌మ మధ్య కాద‌ని చాటి చెబుతున్నారు కొంద‌రు హీరోలు.
తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్ ఖాన్‌.. అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ రాధే అని చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భుదేవా.. అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన డీజే సినిమాలోని సీటీ మార్ పాట‌ను రీమేక్ చేశారు. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలోనే.. అల్లుఅర్జున్ డ్యాన్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు స‌ల్మాన్‌. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. సీటీమార్ పాట‌ను మాకు అందించినందుకు ధ‌న్య‌వాదాలు. నువ్వు ఈ పాట‌లో డ్యాన్స్ చేసిన తీరు అద్భుతం. జాగ్ర‌త్త‌గా ఉండూ బ్ర‌ద‌ర్ ల‌వ్ యూ అంటూ ట్వీట్ చేశారు.

స‌ల్మాన్‌లాంటి బ‌డా హీరో త‌న డ్యాన్స్‌పై స్పందించ‌డం ప‌ట్ల అల్లు అర్జున్ కూడా ఖుషీ అయ్యారు. స‌ల్మాన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ ట్వీట్ చేస్తూ.. స‌ల్మాన్ గారు మీకు ధ‌న్య‌వాదాలు. మీ నుంచి ప్ర‌శంస‌లు అందుకోవ‌డం నిజంగా మ‌రిచిపోలేని అనుభూతి. మీ అభిమానులు రాధే సినిమా థియేట‌ర్ల‌లో సీటీమార్ వేయ‌డం కోసం ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమ‌కు నా ధ‌న్యవాదాలు అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *