అదుపుతప్పి లారీ బోల్తా !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –బుచ్చిరెడ్డిపాళెం కనిగిరి రెజర్వాయిర్ వద్ద ఉన్న హెచ్ పి గ్యాస్ గోడాన్ వద్ద ఓ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పక్కనే ఉన్న పొల్లాలోకి దూసుకుపోయింది. అయితే లారీలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రాణాపాయం నుండి డ్రైవర్ బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే AP04TW6658 నంబరు గల ఓ ఐరాన్ లోడ్ బండి నెల్లూరు నుండి సంగం వైపు వెళ్తుంది.రాత్రి కావడంతో డ్రైవర్ నిద్రమత్తులో మరి సడన్ బ్రేక్ వేయడం వలనో లారీ అదుపుతప్పి రెజర్వాయిర్ అవతల ఉన్న హెచ్ పి గాస్ గోడాన్ ఎదురుగ ఉన్న పొల్లాలోకి దూసుకుపోయింది.దీంతో లారీలో ఉన్న ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు.అయితే వాస్తవంగా ఏమి జరిగిందో అనే పూర్తి విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.డ్రైవర్ మాత్రం లారినీ అక్కడే వదిలిపెట్టేసి వెళ్లిపోయినట్టు అక్కడ పలువురు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *