వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అబ్దుల్ అజీజ్ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కరోనా ను ఎదుర్కోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికార పార్టీ పై నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వారిలో కనీసం 20 శాతం మందికి వెంటిలేటర్ అవసరం ఉండొచ్చని, ఆ బెడ్ లు కూడా అరెంజ్ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం, అధికారులు ఉన్నారని అన్నారు. నెల్లూరు లో కొన్ని హాస్పిటల్స్ నీ కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చి, వారికి కావాల్సిన కనీస సౌకర్యాల గురించి పటించుకోవడం లేదని అన్నారు. కరోనా బారిన పడిన పేద ప్రజలు, విగత జీవులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం తో ఆలోచించి ప్రజలకు తగు న్యాయం చేయాలని, ప్రజలకు అన్యాయం చేయవద్దని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *