వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవు!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
– తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ గాంధీబొమ్మ సెంటర్ లో టీడీపీ నేతల ఆందోళన
చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేక నిర్బంధం చేసారని మండిపడ్డారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తిరుపతి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అని అన్నారు. తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తే మునిసిపల్ ఎన్నికల్లో గెలవడం కష్టమనే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారన్నారు.