విద్యార్ధినుల విద్య పై ఏపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ…!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–విద్యార్ధినుల విద్య పై ఏపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ సారిస్తోంది. విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు శిక్షణ పై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. విద్యార్ధినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందివ్వాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ తెలిపారు. దీని కోసం లాప్టాప్లను వాడుకోవాలన్నారు సీఎం. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్‌తో పాటు ప్రముఖ శిక్షణా సంస్థల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు ఆదేశించారు జగన్. విద్యార్ధుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు. ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు సీఎం. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్ధినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు సీఎం జగన్. లాప్టాప్లను విద్యార్ధినులకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించండి అని అధికారులకు సీఎం జగన్ తెలిపారు.