వెంకన్నపాలెం సముద్ర తీరంలో గుర్తుతెలియని మృతి దేహం లభ్యం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం, పట్టపుపాలెం లోని సముద్రతీరంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం అయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ ఐ ఇంద్రసేనారెడ్డి యువకుడి మృతదేహాన్ని పరిశీలించగా సుమారు 25 సంవత్సరాల వయసు కలిగే నా వ్యక్తిపై ఒంటి మీద గాయాలను పోలీసులు పరిశీలించారు . యువకుడిపై దాడి జరిగిందని చనిపోయిన తర్వాత మృతదేహాన్ని సముద్రంలోనికి వదిలేసి వెళ్లి ఉండవచ్చని ఎస్ ఐ స్థానికులను విచారించగా చనిపోయిన వ్యక్తిని ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు ఎస్ఐకి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడు తెలియాల్సి ఉందని అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *