పింగళి వెంకయ్యకి భారతరత్న ఇవ్వాలి-పవన్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మన జాతీయ పతాకం దేశ ఔన్నత్యానికి సగర్వ సంకేతమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పింగళి వెంకయ్యకి భారతరత్న ఇవ్వాలని, ఊరూరా విగ్రహాలు నెలకొల్పాలని సూచించారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించింది మువ్వన్నెల జెండా అన్నారు. మన దేశ ఔన్నత్యానికి, సమరవీరుల త్యాగఫలానికి సగర్వ సంకేతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ పతాకం రెపరెపలు మొదలై నేటికి శత వసంతాలు పూర్తి కావడం, ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన మధుర క్షణాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *