తిరుపతిలో కొవిడ్ వాక్సిన్ వేయించుకున్న మోహన్ బాబు…!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు తిరుపతిలో ఈ రోజు కొవిడ్ వాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. తొలి డోస్ వాక్సినేషన్ తిరుపతిలో వేయించుకున్నానని, విలువైన సమయానని వృధా చేయకుండా అందరూ వాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నానని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా నిస్వార్థంగా సేవచేస్తున్న వైద్యులు, వైద్య రంగ సిబ్బందికి మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఆ మధ్య వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’లో కీలక పాత్రను పోషించిన మోహన్ బాబు… ప్రస్తుతం ‘సన్నాఫ్ ఇండియా’లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీతో రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *