రేపు ‘వకీల్ సాబ్ ‘ నుండి మరో పాట!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ నుండి మరో పాట రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతోంది. సత్యమేవ జయతే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, తమన్ స్వరరచన చేశారు. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. శ్రుతీహాసన్ తో పాటు నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న రాబోతోంది. అమితాబ్ నటించిన ‘పింక్’కు రీమేక్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *