వామపక్షాల ఆధ్వర్యంలో కోవూరులో ప్రశాంతంగా బంద్ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తలపెట్టిన రాష్ట్ర బంద్, ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో కోవూరు సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు దుకాణదారులు స్వచ్ఛందంగా మూత వేసి బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడంలో భాగంగా మన రాష్ట్రంలో కూడా రెండు లక్షల కోట్లు విలువైన ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కంపెనీ చేయడాన్ని తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు 32 మంది ప్రాణత్యాగం తో వేలాది మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇవ్వడంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కులో సాధించుకుంటామని తెలిపారు. అదేవిధంగా పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటు ఉన్నాయని దీంతో ప్రజా జీవనం అతలాకుతలమైంది అని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుమీదకు వచ్చి తమ ఆందోళనను తెలియజేస్తున్న గాని మోడీ సర్కార్ వదలడం లేదని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *