పేదల భూముల జోలికి వస్తే ఊరుకోం…!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆసిఫ్ అలీఖాన్ అనే వ్యక్తి, అతని తండ్రి అయూబ్ ఖాన్ ఏబీఎన్ ఛానల్ ని అడ్డంపెట్టుకని గత కొద్దిరోజులుగా వైసీపీ నాయకులను కబ్జాదాలుగా చూపిస్తున్నారని, మా నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎం.ఆర్.పీ.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్లు కబ్జా చేసి మా వైసీపీ నాయకులపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఆ స్థలం ఎవరిదో ఎవరు కబ్జాచేశారో మేము ఆధారాలతో నిరూపిస్తామని, ఒక్క వైసీపీ నాయుకుడైనా ఆ స్థలం విషయంలో కబ్జా చేసినట్లు ఆ ఛానల్ వాళ్లు నిరూపించారి, వైసీపీ నాయకులమైన మేము ఏ పేదల భూమిని కబ్జా చేశామో నిరూపించండని సవాల్ చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దళితులకు, పేదలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. దళితుల భూములు ఎవరు ఆక్రమించినా వారు ఎంతటి వారైనా మా వైసీపీ ప్రభుత్వం వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. పేదల భూముల జోలికి వస్తే ఊరుకోమని, వైసీపీ తరుపున పేదలకు, దళితులకు అండగా ఉంటూ పోరాడతామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *