భారత్ విజ్ఞప్తిని పట్టించుకోని చమురు ఎగుమతి దేశాలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –చమురు ఉత్పత్తిపై పరిమితులను సడలించాలని భారత దేశం చేసిన విజ్ఞప్తిని ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ) పట్టించుకోలేదు. మరోవైపు సౌదీ అరేబియా మన దేశానికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. గత ఏడాది చౌక ధరలకు కొనుగోలు చేసిన చమురును ఉపయోగించుకోవాలని చెప్పింది. దీంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. మన దేశంలో ఇప్పటికే వినియోగదారులకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్ ధరలపై ఈ పెరుగుదల ప్రభావం ఉండవచ్చు. అయితే శాసన సభ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ధరలను పెంచే సాహసానికి తెగించకపోవచ్చుననే వాదన కూడా ఉంది.

ఒపెక్, దాని మిత్ర దేశాలను కలిపి ఒపెక్ ప్లస్‌ అని పిలుస్తారు. వీటి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముందే భారత దేశ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పెట్రోలియం ఉత్పత్తిపై విధించుకున్న ఆంక్షలను సడలించాలని, చమురు ధరల స్థిరీకరణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై దెబ్బపడుతోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *