ఏప్రిల్ 2న పరిశుద్ధ స్లీవమార్గం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని పునీత చిన్న తెరేసమ్మగారి పరిశుద్ధ ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ స్లీవమార్గం ఘనంగా ప్రారంభం అవుతుందని ఫాస్టర్ డెవిడ్ తెలిపారు. నెల్లూరులోని చింతారెడ్డి పాళెంలో  విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే రోజున ఉదయం పరిశుద్ధ స్లీవమార్గం చింతారెడ్డిపాళెంలోని పురవిధుల్లో ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఊరేగింపు అనంతరం దైవసన్నిదిలో దైవ వాక్య అర్చనము, శిలువ ఆరాధన, దివ్యసప్ర సాద స్వీకరణ సాంగ్యము నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సాంగ్యములు జరుగుతాయని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *