నెల్లూరులో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన జెసి!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
– నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ లో ఉన్న మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ హరీందిర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1 నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉండే ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శనలో మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల చేనేత వస్త్రాలను నగరవాసులకు అందుబాటులో ఉంచారని తెలిపారు. సుమారు 50 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కళాకారులు ఎంతో కష్టపడి ఈ వస్త్రాలను డిజైన్ చేశారని, నెల్లూరు ప్రజలంతా ఈ ప్రదర్శనకు వచ్చి జయపద్రం చేయాలని కోరారు.