వేరే లెవల్‌‌‌‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్….నెల్లూరులో పూనకాలతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –‘వకీల్ సాబ్’ సినిమా టైలర్ రిలీజ్ సందర్భంగా  నెల్లూరులో అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ కు పాలాభిషేకం చేసారు. అనంతరం పవర్ స్టార్ పోస్టర్స్ తో కటౌట్స్ తో హంగామా చేశారు. వకీల్ సాబ్ ట్రైలర్ ను s2 థియేటర్ లో రిలీజ్ చేసిన సందర్భంగా థియేటర్స్ లో అభిమానుల సందడి మాములుగా లేదు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అనే నినాదాలు ఆకాశాన్ని అంటాయి.ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షుడు మంచి కంటి శ్యాం మాట్లాడుతూ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూసామని తెలిపారు. ట్రైలర్ రాబోతుందని తెలిసిన దగ్గర నుంచి మాములుగా లేదని తెలిపారు. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వేరే లెవల్‌‌‌‌లో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, చిరంజేవి యువత ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *