నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జిల్లాలో రాష్ట్ర బంద్ ప్రశాంతంగా నడుస్తోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక పేరుతో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో అఖిల పక్షాల వారు కలిసి చేసిన రాష్ట్ర బంద్ కు మద్దతుగా టీడీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ మరియు నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదానీ, అంబానీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం పనిచేస్తోందని సీపీఎం నేతలు మండిపడ్డారు. పరిశ్రమలు నష్టాల్లో ఉంటే ఆదాయ మార్గాలు చూపించాల్సిందిపోయి.. ప్రైవేటీకరణ చేయడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ఉపసంహరించుకునే వరకు ఏం చేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు. ఈ బంద్‌ను చూసిన తర్వాత అయినా కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని నేతలు కోరారు.ఈ కార్యక్రమం లో AITUC నాయకులు, AISF నాయకులు, ఎయిడసో నాయకులు, AIYF నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ వర్గాలు, తెలుగుదేశం పార్టీ అన్నీ అనుబంధ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *