నాకు ప్రాణ హాని ఉంది…. రక్షణ కల్పించండి !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఒక వ్యాపారి బాగుంటే.. ఇంకో వ్యాపారికి ఒప్పదు అంటే ఇదే.. తన వ్యాపారం కంటే ఇంకొకరి వ్యాపారం అభివృద్ధి చెందుతుంటే.. కొందరూ ఓర్వలేక ఇలానే ఉంటారు. అలానే తంతులో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం శ్మాశానం వీధిలో వంట నూనెల అంగడి నడుపుకుంటూ జీవిస్తున్నవ్యాపారి సుధాకర్ రావు కుటుంబంపై అదే వీధిలో ఉంటున్న మరో నూనె అంగడి వ్యాపారి గ్రంథి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తరుచూ గొడవలకు వెళ్తూ., వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై తమకు రక్షణ కల్పించాలని, ప్రాణ హాని ఉందని వ్యాపారి సుధాకర్ రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ద్వారా తమను కాపాడాలని విన్నవించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *