బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మహిళ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –తీసుకున్న లోను సమయానికి చెల్లించలేదని తమ ఆస్తులను తమ అనుమతి లేకుండానే అమ్మి బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది ఇంకా తమను వేధిస్తున్నారని నెల్లూరు హరనాథపురానికి చెందిన మక్బుల్ బేగం ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నెల్లూరు మెయిన్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా లో వ్యాపారం నిమిత్తం తమ ఆస్తులను తనఖా పెట్టి లోను తీసుకున్నామని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమయానికి చెల్లించక పోవడంతో తమకు సమాచారం ఇవ్వకుండానే తమ ఆస్తులను అమ్మేశారని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *