కన్నడ బిగ్ బాస్ కు సుదీపే దిక్కు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –తెలుగు బిగ్ బాస్ హోస్టులు మారుతున్నారు కానీ అటు తమిళ, ఇటు కన్నడలో మాత్రం బిగ్ బాస్ హోస్టులు మారడం లేదు. తమిళంలో మొదటి నుండీ ఈ షోను కమల్ హాసన్ నిర్వహిస్తున్నాడు. అలానే వరుసగా ఏడు సార్లు కన్నడ బిగ్ బాస్ కు వ్యాఖ్యతగా వ్యవహరించాడు స్టార్ హీరో సుదీప్. అయితే ఈ సారి మాత్రం తన వల్ల కాదని చేతులెత్తేశాడట. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ కూడా పూర్తి కావడంతో వేరే వారిని చూసుకోమని నిర్వహకులకు సలహా ఇచ్చాడట. కానీ వాళ్ళు మాత్రం సుదీపే ఉండాలని పట్టుబట్టడంతో చివరకు అంగీకరించక తప్పలేదని చెబుతున్నాడు సుదీప్. ఇటీవలే కన్నడ బిగ్ బాస్ షో సీజన్ 8 మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *