తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ కు కోపమొచ్చింది..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. ఎన్నికల ప్రచారంలో కమల్‌హాసన్‌కు ఆవేశంతో ఊగిపోయారు. మైక్‌ పనిచేయడం లేదన్న కోపంతో తన పార్టీ ఎన్నికల గుర్తు చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం విసిరికొట్టారు. కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన పార్టీ గుర్తును కమల్‌ విసిరిగొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత..తొలి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో కమల్ హాసన్ నేతృత్వలోని మక్కల్ నీది మయ్యం కూడా పోటీ చేస్తోంది. ఈ పార్టీ చీఫ్ కమల్ హాసన్ దక్షిణ కోయంబత్తూరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్.. తన నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నరు. కాన్వాయ్ లో వెళ్తూ.. ఓటర్లకు అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో..మాట్లాడుతుండగా.. కమల్ చేతిలో ఉన్న మైక్రో ఫోన్ పని చేయలేదు. మాటలు విన బడకపోవడం కమల్ గమనించారు. వాహనంలో ఉన్న వారిని ఏమైందని అడిగారు. ఎంతకీ మైక్రో ఫోన్ పనిచేయకపోవడంతో.. తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. చేతిలో ఉన్న పార్టీ గుర్తు టార్చ్ లైట్ ను అమాంతం వాహనంలోకి విసిరికొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. కమల్.. అంత కోపం వద్దూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *