వాక్సినేషన్ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ !!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరులో మూడవ విడత కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా కోవిడ్ టీకా కేంద్రంలో వాక్సినేషన్ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిగా కరోన కేసు నమోదైన జిల్లా నెల్లూరు జిల్లా అని, అప్పటి నుంచి కూడా కోవిడ్ లో అన్ని రంగాలలో కూడా ముందుంటూ ప్రజలను కాపాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఎనలేని సేవ అందించారని అన్నారు. జిల్లాలో వాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య సుమారు నలభై వేల మంది అని తెలిపారు. వాక్సిన్ వేసుకున్నవారు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు.