జాతీయ విశిష్ట సేవా పురస్కార కార్యక్రమం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మనస్వి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎద్దు సదాశివరావు సభ్యులు తనూజ, సునీల్ కుమార్ , విష్ణు నారాయణ, తేజేశ్వరరావు, మనస్వి, తపస్వి చేస్తున్న సేవలను గుర్తించిన ఆదరణ చారిటీ, క్రియేటివ్ కల్చర్, టాలెంట్, వేరియస్ స్కిల్స్ సొసైటీ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాప్ట్స్ తెలుగు నంది జాతీయ విశిష్ట సేవా పురస్కారం అందజేసి సత్కరించింది. ఆదివారం విజయవాడలో ని ఏ ఎన్ ఆర్ కళాక్షేత్రంలో తెలుగు నంది విశిష్ట సేవ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మనస్వి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఆ సంస్థల అధ్యక్షులు నరేంద్ర, కె.ప్రతాప్ లు కొనియాడారు. మనస్వి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సదాశివరావు, సభ్యులు సొంత నిధులుతో పేదలకు బియ్యం , నిత్యావసరాలు పంపిణీ చేయడం , నిరు పేదలకు అన్నదానం , కరోనా సమయంలో శానిలైజర్లు , మాస్కలు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు తమకు తెలుగు నంది విశిష్ట సేవ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని ట్రస్ట్ చైర్మన్ సదాశివరావు సభ్యులు ఆనందాన్ని వ్యక్తo చేశారు. తెలుగు నంది పురస్కారం అందజేసినoదుకు కృతజ్ఞతలు తెలిపారు. మనస్వి చారిటబుల్ ట్రస్ట్ కు జాతీయస్థాయి అవార్డు రావడంతో పలు సేవా సంస్థలు , మిత్రులు , సహచర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *