డిగ్రీ పరీక్షలను వాయిదా వేయండి…!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మూడో, అయిదో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ… నెల్లూరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని వీఆర్​సీ సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. విఆర్ కళాశాలలో అధ్యాపకులు కొరత కారణంగా సిలబస్ పూర్తి కాలేదని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్​లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *