చంద్రబాబును ఎయిర్‌పోర్ట్‌లోనే నిర్బంధిస్తారా?: సోమిరెడ్డి!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
– మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీ అనుమతితో చిత్తూరుకు వెళితే ఎయిర్ పోర్టులోనే నిర్బంధిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను నిలదీసి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజా ప్రభుత్వం కాదు…. పోలీస్ పాలన నడుస్తున్నట్టుందని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.