సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ రైల్వే గేట్‌ దాటుతుండగా ఢీకొట్టిన ట్రైన్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ రైల్వే గేటు దాటుతున్న సమయంలో ట్రైన్ ఢీ కొట్టింది. నెల్లూరు విజయ మహల్‌ రైల్వే గేట్‌ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అల్లాభక్ష్‌ కు తీవ్ర గాయాలయ్యాయి.గేట్‌ క్రాస్‌ చేసే సమయంలో రెండు రైళ్లు ఒకేసారి రావడంతో అది గమనించకుండా దాటే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన జరిగింది. గాయపడిన అల్లాభక్ష్‌ ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *