ఏపీ కరోనా అప్‌డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఏపీలో గడిచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు నిర్వహించగా 106 పాజిటివ్ కేసులు నిర్థరాణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 33 కేసులు నమోదు కాగా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. అదే సమయంలో 57 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,137కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,169. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,40,10,024 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *