షణ్ముక్ జస్వంత్‌పై బిగుస్తున్న ఉచ్చు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్‌కు పోలీసుల ఉచ్చు బిగుస్తుస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ కేసులో షణ్ముక్ పట్టుబడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు షణ్ముక్ హాజరుకాలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు.

డ్రంకెన్​ డ్రైవ్​పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతటి కఠినమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్​స్టార్​ షణ్ముక్​ అతివేగంగా కారు నడిపి జూబ్లీహిల్స్‌లో వాహనాలను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారుతో ఢీ కొట్టాడు. పోలీసులు అక్కడికి చేరుకొని షణ్ముక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 170 పాయింట్లుగా తేలిందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ‘సూర్య’, ‘సాఫ్ట్​వేర్​​ డెవలపర్​’ వంటి పలు వెబ్​సీరిస్‌లలో షణ్ముఖ్​ నటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *