భారత్‌లో ఒక్కరోజులోనే 354 కరోనా మరణాలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంది. వైరస్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్‌లో గడిచిన 24గంటల్లో 53,480 పాజిటివ్ కేసులు నమోదవగా, 354 మంది వైరస్ బారినపడి చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా మరణాల్లో ఈ సంఖ్య అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,21,49,335కేసులు నమోదవగా 1,62,468మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *