ఆటో రిక్షాపై అందమైన ఇల్లు.. !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –తమిళనాడులోని నమక్కల్‌కు చెందిన ఎన్‌ జీ అరుణ్ ప్రభు ఆర్కిటెక్చర్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు చెన్నై, ముంబై మురికివాడల్లోని గృహాలపై పరిశోధన చేశాడు. అక్కడి నిర్మాణాల్లో స్థలాన్ని సరిగ్గా వినియోగించకపోవడం వల్ల రూ.4-5 లక్షలు ఖర్చు చేసి ఇల్లు నిర్మించినా అందులో మరుగుదొడ్డి ఉండదని గ్రహించాడు. అయితే కొద్దిపాటి స్థలంలోనే తక్కువ ఖర్చుతో కంఫర్ట్‌బుల్‌గా ఇంటిని నిర్మించాలనేది అతని కల.

తన చదువు పూర్తికాగానే ఓ ఆటోరిక్షాలోని వెనుక భాగంలో 36 చదరపు అడుగుల్లో లక్ష రూపాయల్లోనే ఫోర్టబుల్ ఇంటిని నిర్మించి తక్కువ స్థలంలో మంచి ఇంటిని కట్టుకోవచ్చని నిరూపిస్తున్నాడు. ఈ ఆటోరిక్షా ఇంటిని సోలో 01 అని పిలుస్తుండగా ఈ ఆటో మొబైల్ హౌస్‌లో ఒక చిన్న బెడ్‌ రూం, కిచెన్, లివింగ్ ఏరియా, బాత్‌ రూంతో పాటు వర్కింగ్‌ ఏరియాకు కూడా ఓ గదిని ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఈ ఇంటిపై ప్రభు 250 లీటర్ల వాటర్ ట్యాంక్‌ను కూడా సిద్ధం చేశాడు. ఇందులో ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా జీవనం సాగించవచ్చిన చెబుతున్నాడు. కొన్ని సంవత్సరాలు లేదా నెలలు ఓ ఏరియాలో ఉండేవారు అంటే కార్మికులు. సంచార జాతుల వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు.

అయితే ఆన్‌లైన్‌లో ఈ ఇంటిని చూసిన ప్రముఖ వ్యాపారవేత్త అతడి ఐడియాను పొడుగుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన..‘అరుణ్ తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని ఎలా సృష్టించాలో చూపించాడు. అది ఒక పెద్ద ట్రెండ్ ను క్రియేట్ చేసిందన్నాడు. నిజానికి ఈ హోమ్‌ను ప్రదర్శన కోసం ఉంచాలనుకున్నాడని కూడా చెప్పారు. అంతేకాకుండా బొలెరో వాహనంపై నిర్మించగలవా అంటూ అడిగారు. కరోనా మహమ్మారి సమయంలో… ఎవరైనా మమ్మల్ని కనెక్ట్ చేయగలరా? అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *