గూడూరులో నిరసన వ్యక్తం చేసిన అఖిలపక్షం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం లో పుర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. దుకాణాలు, బ్యాంకు లను మూయించి వేసి అంబేడ్కర్ కాంస్య విగ్రహం కు పూల మాలలు వేసి నినాదాలు చేపట్టారు. టవర్ క్లాక్ సెంటర్ లో మానవహారం చేపట్టి నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపో కే పరిమితం అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పుర వీధుల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు. దుకాణ దారులు బంద్ కు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *