ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రజలకు ఏమి చేసామన్నది ముఖ్యం….!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –గూడూరు అభివృద్ధి కోసం మేము ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేస్తే మీరు నన్ను విమర్శించేదానికి ప్రెస్ మీట్ పెట్టి, హరిశ్చంద్రా రెడ్డి గూడూరు అభివృద్ధి కోసం రెండు మూడు సార్లు కలిశారు అని అబద్ధాలు చెప్తే ఎలా?నేను ఎన్ని సార్లు కలిశాను గూడూరు అభివృద్ధి కోసం ఏమి చేసాను అనేది మీడియా లో వచ్చిన కధనాలు, టీవీ లో వచ్చిన వీడియోలు చూడండి, ఇప్పుడు మీడియా కు చూపిస్తున్న అవసరం ఐతే మీరు కూడా చూడవచ్చు అంతే కాని ఇలా అబద్ధాలు చెప్తే ఎలా అని హరిశ్చంద్రా రెడ్డి అన్నారు. గూడూరులో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను పుట్టిన ఈ గూడూరు లో కాంట్రాక్టు పనులు చేయను,ఎందువల్ల అంటే ఇక్కడ ఏ పని చేసినా స్వార్థం కోసం లాభం కోసం చేయకూడదు అనేది నా సిద్ధాంతం,నా నియమం అని అన్నారు. గూడూరు చెరువుకు నీరు వచ్చే ప్రధాన కాలువలో ఒకటైన నాయుడు కాలువ కు తన సొంత నిధులతో పూడిక తీత పనులు చేయించా,ప్రతి పైసాకు నా దగ్గర లెక్క ఉంది రండి చూపిస్తా ఎన్ని లక్షలు అయ్యాయో చూపిస్తా,నేను సంపాదించే ప్రతి రూపాయికి టాక్స్ కడతాను,డబ్బులు ఎక్కువై రాజాకీయాల్లో కి రాలేదు ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చాను.. ఊరికే విమర్శించే పెద్ద రాజకీయ నాయకులు తమ చిత్తశుద్ధి గూడూరు అభివృద్ధి మీద చూపండి అని అన్నారు.

“నాన్న ఆశయాల మేరకు ఆయన పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, కొన్ని లక్షల రూపాయల తో రైతుల కోరిక మేరకు సకాలంలో పంటలు వేసుకునే దానికి పెద్ద చెరువుకు నీరు వచ్చేదానికి ప్రభుత్వ నిధులు రావడం ఆలస్యం అవుతుందని సొంత నిధులతో కాలువ పనులుచేసా,సొంత నిధులతో కోవిడ్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేసాను,గూడూరు పట్టణం గాంధీనగర్ ప్రాంతంలో వర్షాలకు ఒక వృద్దు రాలి పూరిల్లు కూలిపోగా కేవలం 15 రోజుల్లో ఇల్లు కట్టించి ఇచ్చాము,ఊరు బాగుండాలని కొన్ని లక్షల రూపాయల తో కొనేటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థానం కోనేరు నిర్మాణం చేపట్టి గత 13 సంవత్సరాలు గా ఉత్సవాలు జరిపిస్తూ ఉన్నాము,ధర్మ రధం పేరిట అంతిమయాత్ర కోసం వాహనం ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఉపయోగించుకునేలా చూస్తున్నాము,గూడూరు లో క్రీడా మైదానానికి కోట్ల రూపాయల సొంత భూమిని కూడా ఇచ్చాము పదవులు ఏమీ లేకుండానే ఇన్ని చేస్తున్నాము ప్రజలు ఆశీస్సులు తో పదవులు వస్తే ఇంకా ఈ గూడూరుకు ఎంతో సేవ చేస్తాం” అన్నారు.

జలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోము భిన్నంగా కూడా స్పందిస్తాం…రైట్ to కాల్ కి కూడా వెనుకాడబోము,,నియజకవర్గంలో 26శాతం పైన్ ఓటర్లు 10రూ స్టాంప్ మీద అఫిడవిట్ తీసుకుని దాంతో స్పీకర్ తలుపు కూడా తడతాము గుర్తుంచుకోండి అని అన్నారు.

ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి నిజాయితీగా, నిస్వార్థంగా సొంత ఊరికి ఎదో సేవచేయాలనే తపన పడే తనమీద మీద ఆరోపణలు తో మరింత చెడ్డపేరు తప్ప ప్రయోజనం ఏమి లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *