టౌన్ హాల్ లో ఈ నెల 28న టైలర్స్ డే!!
1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరులోని టౌన్ హాల్ లో ఈ నెల 28న టైలర్స్ డే జరుగుతుందని టైలర్స్ వెల్ఫేర్స్ అసోషియేషన్ నాయకులు తెలిపారు. నెల్లూరు లోని ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28 తేదీన ఉదయం 9:30 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు.టైలర్స్ సోదరులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని సభను జయప్రదం చెయ్యాలని వారు కోరారు.