సామంతు సుబ్బారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి సోమిరెడ్డి !!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లులో షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ సామంతు సుబ్బారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గా, సమితి ప్రెసిడెంటుగా, జొన్నవాడ ఆలయ చైర్మన్ గా ఆయన అందించిన సేవలు ఎనలేనివన్న అని అన్నారు. సుదీర్ఘ ప్రస్థానంలో సంప్రదాయ రాజకీయాలతో మచ్చలేని నాయకుడిగా గుర్తింపుపొందారన్నారు. సుబ్బారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.