శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు నగరంలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహన సేవ అనంతరం రంగనాథస్వామివారిని గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషన్ దంపతులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులైయ్యారు. ఈ గరుడ సేవా ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *