దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 సీజన్‌కు ముందు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(39) దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సిమత్ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు. ధోనీ రాక సందర్భంగా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిస్టర్ కూల్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఫొటోలు, సెల్ఫీల కోసం పోటీలు పడ్డారు.
ప్రస్తుతం తన స్వస్థలమైన రాంచీలో ఉన్న ధోనీ ఈ ఆలయాన్ని తరచూ సందర్శిస్తుంటాడు. ఏదైనా పెద్ద క్రికెట్ టోర్నీలో పాల్గొనేముందు మహీ ఇక్కడికి వచ్చి పూజలు చేసి దేవ్రీ మాత ఆశీర్వాదం తీసుకుంటాడు. ఏప్రిల్‌లో ఐపీఎల్-2021 సీజన్ ప్రారంభంకానుంది. గతేడాది సీజన్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీసం ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించలేదు.