పోస్టర్‌తో ఆకట్టుకుంటున్న రాజరాజ చోర!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. శ్రీవిష్ణు ఈ ఏడాది మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు. గాలి సంపత్, రాజరాజ చోరా, అర్జున ఫల్గున సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయంట. అయితే నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా రాజరాజ చోర మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు చేతిలో టార్చ్ పట్టుకొని దొంగతనం చేయడానికి ఇల్లు వెతుకుతున్నట్లు ఉంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడి గెటప్‌లో విష్ణు కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు కూడా అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారంట. ఈ సినిమాను హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *