పేలుడు పదార్ధాల కేసులో ట్విస్ట్‌..ముఖేష్‌, నీతా అంబానీని టార్గెట్ చేస్తూ బెదిరింపు లేఖ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ముఖేష్ అంబానీ నివాసం దగ్గర పేలుడు పదార్ధాల ఘటనలో కొత్త ట్వీస్ట్ బయటపడింది. ఆంటిలియా వద్ద పార్క్ చేసి ఉంచిన ఆకుపచ్చ రంగు స్కార్పియో కారులో ముంబై ఇండియన్స్‌ బ్యాగ్‌తో పాటు..ఒక లేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ లేఖలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే.. అని లేఖలో రాసుంది. ఇది చూసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు అంబానీ లాంటి పారిశ్రామిక దిగ్గజాన్ని టార్గెట్ చేసిందెవరు? ఆయనను చంపాలనుకున్నారా? బెదిరించి వదిలేయలనుకున్నారా? లేఖ చూస్తే మాత్రం అంబానీని టార్గెట్‌ చేసినట్లు క్లీయర్ గా తెలుస్తోంది.

ముఖేష్‌ అంబానీ, ఆయన భార్య నీతాకు ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే.. అనే లేఖ రాయడం వెనుక ఆ దుండుగుడి ఉద్దేశం ఏంటీ? ఈ బెదిరింపులకు కారణమేంటి? ముఖేష్‌ భార్య నితాను కూడా బెదిరించాల్సిన అవసరమేంటి? ముంబై ఇండియన్స్‌ బ్యాగ్‌లోనే లేఖను పెట్టడానికి ఏదైన కారణముందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ను టార్గెట్ చేశారంటే దీనిక వెనుక ఎవరైన ఉగ్రవాద గ్రుపులున్నాయా అనే యాంగిల్‌లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

అంబానీ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తోన్నారు. దీనికోసం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు సైతం దర్యాప్తులో భాగస్వామ్యమయ్యారు. ఆంటిలియా దగ్గర పార్క్ చేసి ఉంచిన ఆకుపచ్చ రంగు స్కార్పియో కారులో లభించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి లభించాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆంటిలియా దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

జిలెటిన్ స్టిక్స్‌ నింపి ఉన్న స్కార్పియోను మరో తెల్లరంగు కారు అనుసరించడం, కొంతసేపటి తరువాత ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. స్కార్పియో వచ్చి ఆగిన చాలాసేపటి వరకు డ్రైవర్ అందులోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సీసీటీవీ ఫుటేజీలను ముంబై పోలీసుల నుంచి యాంటీ టెర్రరిస్ట స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్షున్నంగా పరిశీలిస్తోన్నారు.

మరోవైపు కారులో లభించిన జిలెటిన్ స్టిక్స్ అసెంబుల్డ్ కాదని తేలినట్టు సమాచారం. అసెంబుల్డ్ కాకపోవడంతోనే అవి పేలే అవకాశం లేదని వారు అంచనా వేస్తోన్నారు. భయాందోళనలకు గురి చేయడానికే ఉద్దేశపూరకంగానే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే లేఖలో కూడా ఇది ట్రైలర్‌ మాత్రమే అని రాసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *