నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి అనిల్…!!
1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరు నగరంలోని బృందావనం, నర్తకి సెంటర్ తదితర ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాలలో డ్రైనేజీల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేలూరు మహేష్, సూరిశెట్టి నరేంద్ర, దార్ల వెంకటేశ్వర్లు, కొణిదల సుధీర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.