మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దం.. జిల్లావారీ వివరాలు ఇవే !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, అదే రోజున కౌంటింగ్‌ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 20 డివిజన్లల్లోని 160 మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడతలో 3,221 పంచాయతీలకు, 32, 502 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. ఈ మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్‌ పదవులకు 7,756 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఇక జిల్లాల వారీ మూడో విడత పంచాయతీ ఎన్నికల వివరాలు ఈ మేరకు ఉన్నాయి.

శ్రీకాకుళం:

డివిజన్లు(02): పాలకొండ, శ్రీకాకుళం

మండలాలు(09): ఆముదాలవలస, బుర్జ, పొందూరు, సరుబుజ్జి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, రేగిడి ఆముదాలవలస.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 45, వార్డు మెంబర్లు: 938

ఎన్నికలు:

సర్పంచులు: 248 , వార్డు మెంబర్లు: 1706

విజయనగరం:

డివిజన్లు(01): విజయనగరం

మండలాలు(09): భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటి రేగ, విజయనగరం.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 37, వార్డు మెంబర్లు: 598

ఎన్నికలు:

సర్పంచులు: 207, వార్డు మెంబర్లు: 1732

విశాఖ:

డివిజన్లు(01): పాడేరు

మండలాలు(11): అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, డుంబ్రీగూడ, జి.మాడుగుల, జీకే వీధి, హుకూం పేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 6, వార్డు మెంబర్లు: 893

ఎన్నికలు:

సర్పంచులు: 237, వార్డు మెంబర్లు: 1497

తూ.గో:

డివిజన్లు(02): రంపచోడవరం, ఎటపాక.

మండలాలు(11): అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి, వై. రామవరం, చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 14, వార్డు మెంబర్లు: 448

ఎన్నికలు:

సర్పంచులు: 172, వార్డు మెంబర్లు: 1271

ప.గో:

డివిజన్లు(03): జంగారెడ్డి గూడెం, కుక్కునూరు, ఏలూరు

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 14, వార్డు మెంబర్లు: 371

ఎన్నికలు:

సర్పంచులు: 164, వార్డు మెంబర్లు: 1519

కృష్ణా:

డివిజన్లు(01): మచిలీపట్నం

మండలాలు(12): అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గుడూరు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, పెడన.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 29, వార్డు మెంబర్లు: 750

ఎన్నికలు:

సర్పంచులు: 196, వార్డు మెంబర్లు: 1441

గుంటూరు:

డివిజన్లు(01): గురజాల

మండలాలు(09): దాచేపల్లి, దుర్గి, గురజాల, కారెంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 98, వార్డు మెంబర్లు: 1065

ఎన్నికలు:

సర్పంచులు: 36, వార్డు మెంబర్లు: 369

ప్రకాశం:

డివిజన్లు(01): కందుకూరు

మండలాలు(15): కొండెపి, జరుగుమిల్లి, ఎస్.కొండ, సీఎస్ పురం, గుడ్లూరు, హెచ్‌ఎంపాడు, కందుకూరు, కనిగిరి, లింగసముద్రం, పామూరు, పీసీ పల్లి, పొన్నలూరు, ఉలవపాడు, వెలిగండ్ల, వీవీ పాలెం.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 62, వార్డు మెంబర్లు: 1201

ఎన్నికలు:

సర్పంచులు: 237, వార్డు మెంబర్లు: 1651

నెల్లూరు:

డివిజన్లు(02): గూడూరు, నాయుడు పేట

మండలాలు(15): బాలాయపల్లి, చిలకూరు, చిత్తమూరు, డక్కిలి, గూడూరు, కోట, సైదాపురం, వాకాడు, వెంకటగిరి, డీవీ సత్రం, నాయుడుపేట, ఓజిలీ, పెళ్లకూరు, సుళ్లూరుపేట, తడ.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 75, వార్డు మెంబర్లు: 1182

ఎన్నికలు:

సర్పంచులు: 267, వార్డు మెంబర్లు: 1906

కర్నూలు:

డివిజన్లు(02): ఆదోని, కర్నూలు

మండలాలు(14): మద్దికెర, పత్తికొండ, తుగ్గలి, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, మిడ్తూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచర్ల, డోన్‌, ప్యాపులీ, కృష్ణగిరి, వెల్దుర్తి.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 26, వార్డు మెంబర్లు: 557

ఎన్నికలు:

సర్పంచులు: 219, వార్డు మెంబర్లు: 1955

కడప:

డివిజన్లు(02): రాజంపేట, కడప

మండలాలు(11): కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేల్‌, పెనగలూర్‌, పుల్లంపేట, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, టి. సుందుపల్లి, వీరబల్లి.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 59, వార్డు మెంబర్లు: 1068

ఎన్నికలు:

సర్పంచులు: 129, వార్డు మెంబర్లు: 824

అనంత:

డివిజన్లు(01): అనంతపురం

మండలాలు(19): అనంతపురం, బీకే సముద్రం, ఆత్మకూరు, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్, కూడేరు, నారపాల, పామిడి, పెదపప్పూరు, పెద ఒడుగూరు, పుట్లూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్‌, యాడికి, యెల్లనూర్‌.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 23, వార్డు మెంబర్లు: 1076

ఎన్నికలు:

సర్పంచులు: 356, వార్డు మెంబర్లు: 2620

*చిత్తూరు: *

డివిజన్లు(01): మదనపల్లె

మండలాలు(14): గుడిపల్లె, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచర్ల, సదుం, సోమల, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్ద పంజానీ, వి.కోట.

ఏకగ్రీవాలు:

సర్పంచులు: 91, వార్డు మెంబర్లు: 1585

ఎన్నికలు:

సర్పంచులు: 173, వార్డు మెంబర్లు: 1116

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *