పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు- మాజీ మంత్రి సోమిరెడ్డి !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యం, రౌడీయిజం, అక్రమాలతో రెచ్చిపోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు వారికి సహకారం అందించారుని అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టారు..పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి పరవళ్లు తొక్కించారు. అని సోమిరెడ్డి అన్నారు. వీటన్నింటికి ఎదురొడ్డి మూడు విడతల్లో ప్రజల సహకారంతో 27 శాతం పంచాయతీల్లో విజయం సాధించాం అని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నా అభినందనలు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *