నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది- ఎమ్మెల్యే కాకాణి
1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోవిలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హింసాకాండకు తావులేకుండా నీతి నిజాయితీలు, ప్రజాదరణతో తమ అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ ఘర్షణలు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భాలు లేవన్నారు. వర్గ విభేదాలు ఉన్నప్పటికీ వైసిపి అభ్యర్థులు ఒకే నాయకత్వంతో అఖండ విజయం సాధించారన్నారు.