నిర్లక్ష్యం వీడకుంటే మరోసారి లాక్డౌన్!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–కరోనా మహమ్మారి లక్షల మందిని బలితీసుకున్నా ప్రజల్లో ఏమాత్రం భయం కనిపించడంలేదని ముంబై నగర మేయర్ కిషోరీ పడ్నాకర్ వ్యాఖ్యానించారు. రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్లలో చాలామంది ముఖాలకు మాస్కులు ధరించడం లేదన్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమని, ప్రజలు ముందుజాగ్రత్తగా కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మనం మరోసారి లాక్డౌన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
మళ్లీ లాక్డౌన్ అమల్లోకి వస్తుందా, లేదా..? అనేది ప్రజల చేతుల్లోనే ఉందని ముంబై మేయర్ పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే పరిస్థితి అదుపులో ఉంటుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసులు పెరిగి మరోసారి లాక్డౌన్లోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంపై మీడియా ప్రశ్నించగా ఆ నగర మేయర్ పైవిధంగా స్పందించారు.